‘మారి2’ ‘రౌడీ బేబి’ సాంగ్‌ విడుదల

ధనుష్‌ హీరోగా నటించిన చిత్రం తాజా చిత్రం ‘మారి2’. ఈ చిత్రంలో సాయిపల్లవి హీరోయిన్‌. బాలాజీ మోహన్‌ దర్శకుడు. తమిళంలో ఘన విజయం సాధించిన ‘మారి’ కి సీక్వెల్‌గా తెరకెక్కిందీ చిత్రం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్రంలోని ‘రౌడీ బేబీ’ పాటను చిత్ర బృందం విడుదల చేసింది.

యువన్‌ శంకర్‌రాజా స్వరాలు సమకూర్చిన ఈ పాటకు సామ్రాట్‌ సాహిత్యం అందించారు. ధనుష్‌, ఎం.ఎం. మానసి ఆలపించారు. ఈ సంద‌ర్భంగా నిర్మాత‌, హీరో ధ‌నుష్ మాట్లాడుతూ.. ‘మారి’ చిత్రం చాలా పెద్ద విజయం సాధించింది. ఇప్పు‌డు దానికి సీక్వెల్‌గా ‘మారి2’ని విడుద‌ల చేస్తున్నాం. డిసెంబ‌రు 21న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజ‌ర్స్, పోస్ట‌ర్స్ త‌మిళ‌, తెలుగు ప్రేక్ష‌కుల్ని విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాయి. త‌ప్ప‌కుండా ఈ చిత్రం అంద‌ర్ని ఆకట్టుకుంటుంది’ అని అన్నారు.
వండర్‌బార్‌ స్టూడియోస్‌ పతాకంపై ధనుష్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నా. ఇప్పటికే ఈ చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘మారి2’ డిసెంబరు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.