HomeTelugu Big Storiesచిరంజీవి బర్త్‌డే.. కామన్ డీపీ లాంఛ్ చేసిన రామ్ చరణ్

చిరంజీవి బర్త్‌డే.. కామన్ డీపీ లాంఛ్ చేసిన రామ్ చరణ్

Mega Star Common DP releaseమెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు (ఆగస్టు 22) అంటే ఫ్యాన్స్‌కు పండగల ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది కరోనా కారణంగా అది వీలుకాదు. అయినా అభిమానులు సోషల్ మీడియాలో చిరంజీవి బర్త్ డేను ఓ స్థాయిలో సెలబ్రేట్ చెయ్యాలని ఫిక్స్ అయ్యారు. ఇప్పటికే సోషల్ మీడియాలో వేడుకలు షురూ చేసిన అభిమానులు. రేపు ఈ సంబరాన్ని రెట్టింపు చేయనున్నారు. ఈ క్రమంలో కామన్ డీపీని విడుదల చేశారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. హ్యాపీ బర్త్ డే మెగాస్టార్ అంటూ తండ్రికి మొదటి విషెస్ చెప్పాడు. చిరంజీవి ఐకానిక్ కారెక్టర్స్‌తో పాటు కొన్ని ఫోటోలు ఉన్నాయి ఈ డీపీలో. కొండను తొలచుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతూ చివరికి సింహాసనంపై కూర్చున్నారు చిరంజీవి. ఆయన పడిన కష్టన్ని ఈ ఫొటోలో చూపించారు అభిమానులు. అదే విధంగా చిరు పుట్టిన రోజుకు అభిమానులు క్రియేట్ చేసిన ఓ వీడియోను హీరో వెంకటేష్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ మెగాస్టార్ కు అడ్వాన్స్ గా బర్త్ డే విషెస్ తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!