బాహుబలి2 ట్రైలర్ వచ్చేసింది!

ప్రేక్షకులు అందరూ ఎంతగానో ఎదురుచూస్తోన్న ‘బాహుబలి ది కంక్లూజన్’ సినిమా ట్రైలర్ ఈరోజు ఉదయం విడుదల చేశారు. హైదరాబాద్ సినీమ్యాక్స్ లో ఈ వేడుకను నిర్వహించారు. చిత్రబృందం మొత్తం ఈ వేడుకకు తరలి వచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లోకి థియేటర్స్ లో ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ బాషల్లో కూడా ట్రైలర్ రిలీజ్ అయింది.

మొదట 1 నిమిషం 52 సెకన్ల తమిళ ట్రైలర్ రిలీజ్ అయింది. అలానే హిందీలో కరణ్ జోహార్ తన ట్విట్టర్ ద్వారా ట్రైలర్ రిలీజ్ చేశారు. అది కేవలం 24 సెకన్లు మాత్రమే ఉంది. ఇక తెలుగులో రెండు నిమిషాల 24 సెకన్ల నిడివి గల ఆ ట్రైలర్ రిలీజ్ అయింది. విజువల్స్, గ్రాఫిక్స్ వర్క్ ట్రైలర్ లో హైలైట్ గా నిలిచాయి. సినిమాపై ఉన్న అంచనాలు ఈ ట్రైలర్ ద్వారా మరింత పెంచారు. ఏప్రిల్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.