HomeTelugu Newsచిరంజీవిని మెప్పించలేకపోయిన లేడీ దర్శకురాలు

చిరంజీవిని మెప్పించలేకపోయిన లేడీ దర్శకురాలు

10 2
టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి ‘151’ సినిమాల సుదీర్ఘ సినీ ప్రయాణం.. అశేష ప్రజా అభిమానం సంపాదించుకున్న చిరంజీవి కథల విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తారు.. ఆ విషయం అందరికి తెలిసిందే. కథలో దమ్ముంటే చిన్న, పెద్ద డైరెక్టర్ అని తేడా లేకుండా అవకాశాలు ఇస్తారు. అలాంటి చిరంజీవి ఒక లేడీ డైరెక్టర్ కు పదే పదే నో చెప్తున్నారంట. తాజాగా ‘ఓ బేబి’ సినిమాతో సక్సెస్ అందుకుంది లేడీ దర్శకురాలు నందినీరెడ్డి. మెగా హీరోతో సినిమా చేద్దామని ప్రయత్నిస్తుంది. సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ కోసం నందిని ఒక కథను సిద్ధంచేసుకుని చిరంజీవికి వినిపించారట, అయితే ఆ కథలో కొన్ని మార్పులు చేయాలనీ నందినిని కోరాడట చిరంజీవి. అయితే ఆ మేరకు మార్పులు చేశాక నందిని రెండోసారి చిరుని కలిశారట. అయినా ఏమైందో.. చిరును మెప్పించలేకపోయారని వార్తలొచ్చాయి. అప్పటికి చిరు మరిన్ని సలహాలు ఇచ్చి మళ్లీ మార్పులతో రమ్మని పంపిచేశారు. తాజాగా మరోసారి మార్పుల అనంతరం చిరుకు మరోసారి కథ వినిపించారట. కానీ ఈసారి కూడా నందిని చిరుని కన్విన్స్ చేయలేకపోయిందని తెలుస్తుంది. ఈసారి నందిని మార్పులు చేసుకొని మళ్ళీ వస్తుందో లేక మరో హీరోకు కథను వినిపిస్తుందో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!