HomeTelugu Trendingఅఖిల్‌ సినిమాలో 'మెహబూబా' హీరోయిన్‌

అఖిల్‌ సినిమాలో ‘మెహబూబా’ హీరోయిన్‌

Mehbooba heroine in Akhil
అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే, ఆమె కాకుండా మరో హీరోయిన్ పాత్ర కూడా ఈ సినిమాలో ఉందట. ఈ పాత్రలో నేహాశెట్టి నటిస్తున్నట్టు తాజా సమాచారం. గతంలో ఆకాశ్ పూరి హీరోగా నటించిన ‘మెహబూబా’ సినిమాలో నేహా హీరోయిన్‌గా నటించింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాదులో జరుగుతోంది. త్వరలోనే ఇది పూర్తవుతుంది. వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించి చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, వాసువర్మ కలసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

కేజీఎఫ్‌ డైరెక్టర్‌తో ప్రభాస్ ‘సలార్’

పవన్‌ కళ్యాణ్‌ ఫొటోను షేర్‌ చేసిన రేణుదేశాయ్‌

Recent Articles English

Gallery

Recent Articles Telugu