మోడీ నుంచి కాజల్ కు ఆహ్వానం

మోడీ రెండోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈరోజు సాయంత్రం 7 గంటలకు రాష్ట్రపతి భవన్ వద్ద ఈ కార్యక్రమం జరగబోతున్నది. ఈ కార్యక్రమానికి అతిరధ మహారధులు ఎందరో హాజరవుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం అతిదులందరికి ఆహ్వానాలు పంపింది. ఆహ్వానాలు అందుకున్న వారంతా ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు.

ఇదిలా ఉంటె, టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కు కూడా మోడీ నుంచి ఆహ్వానం అందింది. ప్రధానమంత్రి ప్రమాణస్వీకార మహోత్సవానికి హాజరు కావాలని ఇన్విటేషన్ ను పంపారు. కాజల్ ఆ ఇన్విటేషన్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ మహోత్సవానికి తనను ఆహ్వానించినందుకు ఆమె ధన్యవాదాలు తెలిపింది. అయితే, ఈ కార్యక్రమానికి కాజల్ హాజరవుతుందో లేదో మాత్రం చెప్పలేదు.