హీరో కాస్త సీక్వెల్ లో విలన్!

దాదాపు 26 ఏళ్ల క్రితం బాలీవుడ్ లో విడుదలైన చిత్రం ‘సడక్’. సంజయ్ దత్ హీరోగా నటించిన ఈ సినిమా అప్పట్లో ఘన విజయాన్ని అందుకుంది. సంజయ్ కెరీర్ లో చెప్పుకోదగ్గ చిత్రాల్లో ఈ సినిమా ఒకటి. సంజయ్ సరసన పూజా భట్ జంటగా నటించిన ఈ సినిమాను మహేష్ భట్ రూపొందించారు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారు మహేష్ భట్. ఈ సినిమాకు స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమాలో సంజయ్ దత్ కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన పాత్ర ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలో నెలకొంది.
అయితే మొదటి భాగంలో హీరోగా నటించిన సంజయ్ ఇప్పుడు సీక్వెల్ లో విలన్ గా కనిపించబోతున్నాడని సమాచారం. సంజయ్ విలన్ గా కనిపిస్తున్నాడని తెలియడంతో బాలీవుడ్ లో ఇది హాట్ టాపిక్ గా మారింది. జైలు శిక్ష పూర్తి చేసుకొని ఈ ఏడాదే బయటకు వచ్చిన సంజయ్ ప్రస్తుతం ‘భూమి’ అనే సినిమాలో నటించాడు. ఈ నెలలలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో పాటు మరో చారిత్రాత్మక నేపధ్యం గల సినిమా కూడా సంజయ్ నటిస్తున్నాడు.