HomeTelugu Trendingఆ దర్శకుడి గురించి మాట్లాడటం కూడా వేస్ట్‌: నాగ చైతన్య

ఆ దర్శకుడి గురించి మాట్లాడటం కూడా వేస్ట్‌: నాగ చైతన్య

Naga Chaitanya comments on
అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన చిత్రం ‘కస్టడీ’. ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. మాస్ కమర్షియల్ థ్రిల్లర్ గా ఈ మూవీని వెంకట్ ప్రభు తెరకెక్కించారు. ఇక ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది మూవీ యూనిట్. హీరో నాగ చైతన్య కూడా వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నాడు.

ఇక ఈ ఇంటర్వ్యూలలో నాగ చైతన్య చాలా ఆసక్తికర విషయాలని షేర్‌ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్‌ పరశురామ్ గురించి ప్రస్తవన వచ్చింది. దీంతో చైతన్య కలుగజేసుకొని అతని గురించి మాట్లాడటం టైమ్ వేస్ట్ వదిలేయండి అని కామెంట్స్ చేశాడు. అతను నా టైమ్ అంతా వేస్ట్ చేసాడు. ఇప్పుడు అతని గురించి మాట్లాడుకొని టైమ్ వేస్ట్ చేసుకోవడం ఎందుకు అంటూ టాపిక్ డైవర్ట్ చేసేసాడు.

ఇక పరశురామ్ తో ఏం జరిగింది అనేది మీకు కూడా పూర్తిగా తెలిసే ఉంటుంది. ఇక అతని గురించి మాట్లాడుకోకపోవడం బెటర్ అని నా ఉద్దేశ్యం అని చైతూ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. సర్కారు వారిపాట పూర్తయిన వెంటనే నాగ చైతన్యతో సినిమా చేయడానికి పరశురామ్ రెడీ అయ్యారు.

అయితే అనుకుండా ఈ ప్రాజెక్ట్ సడెన్ గా క్యాన్సిల్ అయ్యింది. చైతూతో అనుకున్న ప్రాజెక్ట్ పరశురామ్ పూర్తిగా పక్కన పెట్టి దిల్ రాజు బ్యానర్ లో విజయ్ దేవరకొండతో మూవీ చేయడానికి కమిట్ అయ్యారు. దిల్ రాజు కూడా అఫీషియల్ గా ఈ ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేశారు. దీనికంటే ముందు గీతా ఆర్ట్స్ లో కూడా సినిమా చేయడానికి కమిట్ అయ్యి కొద్ది రోజులు వర్క్ చేసిన తర్వాత సడెన్ గా వారి నుంచి బయటకి వచ్చేసాడు.

ఆ టైమ్‌లో అల్లు అరవింద్ కూడా పరశురామ్ మీద తీవ్ర స్థాయిలో ఫైర్ అయినట్లు తెలుస్తోంది. వెంకట్ ప్రభు కంటే ముందుగా పరశురామ్ తో మూవీ కోసం చైతన్య కూడా చాలా రోజులు టైమ్ వేస్ట్ చేశారు. అయితే ఆ ప్రాజెక్ట్ ని మధ్యలో దర్శకుడు చెప్పకుండా వదిలేసి వెళ్ళిపోయాడు. దీంతో అతనిపై చైతన్య సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో నాగచైతన్య ఈ కామెంట్స్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఆస్తికరంగా ‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!