HomeTelugu Big Storiesబిగ్‌బాస్‌-3.. నాగార్జునపై ట్రోలింగ్‌!

బిగ్‌బాస్‌-3.. నాగార్జునపై ట్రోలింగ్‌!

4 22

స్టార్‌ మా బృందం బిగ్‌బాస్‌ సీజన్‌3 ను నడిపించడానికి హోస్ట్‌గా కింగ్‌ నాగార్జునతో ఒప్పందం చేసుకుంది. అయితే ఇప్పటికే సోషల్‌ మీడియాలో బిగ్‌బాస్‌ మూడో సీజన్‌కు సంబంధించిన ఫేస్‌బుక్‌,ట్విటర్‌ పేజీలు ప్రారంభమయ్యాయి. ఇక వీటిల్లో మూడో సీజన్‌కు సంబంధించిన అప్‌డేట్స్‌ వస్తూ ఉన్నాయి. హోస్ట్‌గా ఒక్క ఎపిసోడ్‌ చేయకముందే.. నాగ్‌పై నెటిజన్లు కన్నేశారు. గతంలో దేవదాస్‌ మూవీ ప్రమోషన్స్‌లో ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిగ్‌బాస్‌ షో గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.

బిగ్‌బాస్‌ షో గురించి అడగొద్దని..తాను బ్యాడ్‌గా మాట్లాడతానని అన్నారు. తనకు బిగ్‌బాస్‌ కాన్సెప్ట్‌ నచ్చదని, అవతలి వ్యక్తి ఏం చేస్తున్నాడని చూడటం లాంటివన్నీ తనకు నచ్చవని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. ఈ మాటలను పట్టుకుని నాగ్‌ను టార్గెట్‌ చేస్తున్నారు. కర్మ అంటే ఇదే.. ఒకప్పుడు తనకు నచ్చదని చెప్పిన షోకే హోస్ట్‌గా చేస్తున్నాడని ఒకరు.. ఎక్కువ డబ్బు ఆఫర్‌ చేసి ఉంటారు అందుకే చేస్తున్నాడని మరొకరు నెగెటివ్‌ కామెంట్స్‌ చేయగా.. కొందరు నెటిజన్లు మాత్రం ‘దాంట్లో తప్పేముందని, అది వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే, ఇది వృత్తిపరమైన నిర్ణయం’ అని నాగ్‌ను సపోర్ట్‌ చేస్తున్నారు. మొత్తానికి ఈ మూడో సీజన్‌ మరింత స్పెషల్‌గా ఉండబోతోందని తెలుస్తోంది. జూలై చివర్లో మొదలు కానున్న ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్ల విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!