HomeTelugu Newsఫిల్మ్ ఛాంబర్ వద్ద ఆత్మహత్యాయత్నం చేసిన హీరో

ఫిల్మ్ ఛాంబర్ వద్ద ఆత్మహత్యాయత్నం చేసిన హీరో

16 1
ఫిల్మ్ నగర్ లోని ఛాంబర్ వద్ద ఒక ప్రొడ్యూసర్ ఆత్మహత్యయత్నం చేశాడు. లక్షల రూపాయలను ఖర్చు చేసి సినిమా తీస్తై తనకు తెలియకుండానే యూ ట్యూబ్ లో సినిమాను గుర్తు తెలియని వ్యక్తులు అప్ లొడ్ చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దుర్గా ప్రసాద్ అనే వ్యక్తి నానిగాడు అనే సినిమాలో హీరోగా నటిస్తూనే సినిమాను నిర్మించాడు. ఈ సినిమా విడుదలకు సిద్దంగా వుంది ఈ సమయంలోనే సినిమా మొత్తం యూ ట్యూబ్ లో అప్లోడ్ అయ్యిందట. ఈ విషయం మీద ఆయన ఛాంబర్ లో ఆయన ఫిర్యాదు చేశాడు. దీని మీద పోలీసులకు కూడా ఫిర్యాదు చేశానని సినిమా ఎంతో కష్ట పడి తీశానని అలాంటిది యూట్యూబ్ లో ప్రత్యక్షమైందని చెప్పాడు. అనంతరం పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశాడు. ఇది గమనించిన పోలీసులు వెంటనే దుర్గా ప్రసాద్ ను చికిత్స నిమిత్తం పక్కనే ఉన్న అపోలో ఆసుపత్రికి తరలించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu