
Nayanthara Net Worth:
సౌత్ సినిమాల ‘లేడీ సూపర్ స్టార్’ నయనతార ఇప్పుడు కేవలం హీరోయిన్‌గానే కాకుండా, మంచి బిజినెస్ వుమన్‌గానూ పేరు తెచ్చుకుంది. సినిమాలు మాత్రమే కాదు, రియల్ ఎస్టేట్, స్కిన్‌కేర్ కంపెనీ, ప్రొడక్షన్ హౌస్, ఫుడ్ చైన్ లాంటి ఎన్నో రంగాల్లో పెట్టుబడులు పెట్టి, రూ.200 కోట్లు పైగా సంపాదించిందట!
2021లో భర్త విక్నేష్ శివన్‌తో కలిసి చెన్నైలోని పోస్ గార్డెన్లో 16,500 చదరపు అడుగుల విల్లా కొన్నారు. ఇందులో హోం థియేటర్, జిమ్, స్విమ్మింగ్ పూల్, స్పా బాత్‌రూమ్ వంటి లగ్జరీ ఫెసిలిటీస్ ఉన్నాయి. అంతేకాదు, హైదరాబాద్, చెన్నై, దుబాయ్‌లో కూడా ఎన్నో ప్రాపర్టీలు ఉన్నాయి. ఇవన్నీ కలిపి విలువ రూ.100 కోట్లు పైగా అని సమాచారం.
వాహనాల విషయంలోనూ ఆమె స్టైల్ చూపింది. BMW 5, 7 సిరీస్, మెర్సిడెస్ GLS 350D ఉన్నాయి. అమె దగ్గర ఓ ప్రైవేట్ జెట్ కూడా ఉంది… అది ఏకంగా రూ.50 కోట్లు విలువ ఉండొచ్చని తెలుస్తోంది.
నయనతార ‘లిప్ బామ్ కంపెనీ’ అనే బ్యూటీ బ్రాండ్‌కు కో-ఫౌండర్. ఈ బ్రాండ్‌కి ఇప్పటివరకు 100కి పైగా ప్రొడక్ట్స్ మార్కెట్లో వచ్చాయి. ఇండియన్ బ్యూటీ ఇండస్ట్రీలో ఈ బ్రాండ్‌కు మంచి గుర్తింపు వచ్చింది. అలాగే చెన్నైలోని స్నాక్స్ & టీ ఫుడ్ చైన్‌లో పెట్టుబడి పెట్టింది. యూఏఈ ఆయిల్ మార్కెట్‌లోనూ 100 కోట్ల వ్యాపారంతో ఎంట్రీ ఇచ్చిందట!
నయనతార, విక్నేష్ కలిసి ప్రారంభించిన ‘రౌడీ పిక్చర్స్’ అనే ప్రొడక్షన్ బ్యానర్ ద్వారా ‘కూజంగల్’, ‘నెట్ట్రికన్న’, ‘కాథువాకుల రెండు కథల్’ వంటి విమర్శకుల ప్రశంసలు అందుకున్న సినిమాలు వచ్చాయి. ఈ బ్యానర్ విలువ రూ.50 కోట్లు అంటున్నారు.













