‘రావణాసుర’ కొత్త పోస్టర్‌ విడుదల

మాస్ మాహారాజా రవితేజ హీరోగా సుధీర్ వర్మ డైరెక్షన్‌లో అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్ మీద అభిషేక్ నామా, శ్రీకాంత్ విస్సా కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘రావణాసుర’ సంక్రాంతి పర్వదినాన ఈ సినిమా పూజ కార్యక్రమాలను నేడు ఘనంగా జరుపుకొంటుంది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్నాయి. తాజగా సంక్రాంతి పండగను పురస్కరించుకొని మేకర్స్ కొత్త పోస్టర్ తో పాటు రిలీజ్‌ డేట్‌ని కూడా ప్రకటించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 30 న ఈ సినిమా విడుదల అవుతున్నట్లు తెలిపారు.

ఇక పోస్టర్ లో మాస్ మహారాజా పేరుకు తగ్గట్టే మాస్ లుక్ లో కనిపించారు. లాయర్ డ్రెస్ లో నోట్లో ఉన్న సిగార్ ని వెలిగిస్తూ కనిపించాడు. ముఖ్యంగా ఆ లాయర్ డ్రెస్ మీద రక్తపు మరకలు చూస్తుంటే.. ఈ పోస్టర్ ఫైట్ సీన్లో తీసినట్లు తెలుస్తోంది. మాస్ మహారాజా రవితేజ ఈ సినిమాలో పది గెటప్పుల్లో కనిపించనున్నట్లు టాక్. ఇకఈ చిత్రంలో అక్కినేని హీరో సుశాంత్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. మరి పోస్టర్స్ తోనే భారీ అంచనాలు నెలకొల్పిన ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

CLICK HERE!! For the aha Latest Updates