HomeTelugu Newsకోనసీమలో కొత్త వైరస్‌ హల్‌చల్‌

కోనసీమలో కొత్త వైరస్‌ హల్‌చల్‌

9
ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రాణాంతక వైరస్ కరోనా థాటికి చైనాలో ఇప్పటి వరకు 200 మందికి పైగా మృతి చెందారు. చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ వైరస్‌ దాదాపుగా 10వేల మందికి వ్యాపించినట్లు గణాంకాలు చెప్తున్నాయి. ఈ వైరస్ 17 దేశాల్లో వ్యాపించినట్టు సమాచారం. చైనాను కరోనా వైరస్ వణికిస్తుంటే, ఆంధ్రప్రదేశ్ లోని కోనసీమను హెర్సిస్ వైరస్ భయపెడుతున్నది. ఈ హెర్సిస్ వైరస్ వలన కోళ్లు చనిపోతున్నాయి.

హెర్సిస్ వైరస్ సోకిన కోళ్ల చర్మంపై బొబ్బలు వస్తున్నాయి. ఆ బొబ్బలు పగిలి రంద్రాలు ఏర్పడటంతో కోళ్లు చనిపోతున్నాయి. కొన్ని రోజుల్లోనే వేలాది కోళ్లు మృత్యువాత పడినట్టు సమాచారం. ఈ వైరస్ సోకిన కోళ్లు లంపి స్కిన్ వ్యాధితో మరణిస్తున్నాయి. కాగా, వైరస్‌ను తగ్గించేందుకు ఇప్పటి వరకు ఎలాంటి వ్యాక్సిన్ కనుగొనలేదని పశువైద్యులు చెప్తున్నారు. ఈ వైరస్ వలన తాము కోళ్లను నష్టపోతున్నామని వ్యాపారులు అంటున్నారు. ప్రస్తుతం కోళ్లకు మాత్రమే వస్తున్న ఈ వైరస్‌ కారణంగా మనిషులకు ఎలాంటి ప్రమాదం ఉంటుందో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu