అనుష్క ముందుగానే రాబోతుంది!

దక్షిణాది అగ్ర హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘భాగమతి’. ‘పిల్ల జమీందార్’ ఫేమ్ దర్శకుడు అశోక్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా జనవరిలో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందనే మాటలు వినిపించాయి. కానీ ఇప్పుడు సినిమా అనుకున్నదానికంటే ముందుగానే ఆడియన్స్ ను పలకరించబోతుంది. మొదట గ్రాఫిక్స్ వర్క్ కారణంగా సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకున్నారు.

కానీ ఇప్పుడు పనులు వేగం పుంజుకోవడంతో డిసంబర్ నెలలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే డిసంబర్ లో అఖిల్ ‘హలో’ సినిమా అలానే నాని ‘ఎంసిఏ’ చిత్రాలు విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ లిస్ట్ లో ‘భాగమతి’ కూడా చేరింది. మరి ఈ మూడు చిత్రాల్లో విజేతంగా ఏ సినిమా నిలుస్తుందో.. చూడాలి!