అఖిల్‌ రియల్‌ హీరో అంటున్న హీరోయిన్‌!

అక్కినేని వారసుడు అఖిల్ ప్రెజెంట్ ‘మిస్టర్ మజ్ను’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మొత్తం దాదాపు పూర్తైపోయింది. జనవరిలో సినిమా విడుదలకానుంది. ఈ చిత్రంలో నిధి అగ్రవాల్ హీరోయిన్‌గా నటించింది. హీరో అఖిల్ గురించి నిధి మాట్లాడుతూ ఒకసారి షూటింగ్లో లైట్ విరిగి నా ముఖం మీద పడబోయింది. అప్పుడు అఖిల్ వెంటనే తన చేయి అడ్డుపెట్టి దాన్ని ఆపాడు. అతను లేకుంటే ఖచ్చితంగా నా ముఖానికి గాయం అయ్యుండేది. ఆ క్షణం నిజంగా అఖిల్ నాకు రియల్ హీరోలా కనబడ్డాడు అంది. ఇకపోతే ఏ చిత్రాన్ని ‘తొలిప్రేమ’ ఫేమ్ వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్నాడు.