కలర్‌ఫుల్‌గా నిహారిక.. లుక్ వైరల్‌


మెగా డాటర్‌ నిహారిక నటిగా, యాంకర్ గా, వెబ్ సిరీస్ లలో నటించి మెప్పించింది. ఒక మనసు సినిమాతో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. తన నటనతో పాటుగా..మెగా ఫ్యామిలీకి ఉన్న క్రేజ్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ముద్దపప్పు ఆవకాయ్ వెబ్ సిరీస్ తో విపరీతమైన క్రేజ్ ను దక్కించుకుంది. కేవలం సినిమాల్లో నటిగానే కాకుండా నిర్మాతగా కూడా బిజీగా ఉంది. 2020 లో జొన్నలగడ్డ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది నిహారిక.

వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఇటీవలే వీరు విడాకులు తీసుకోబోతున్నట్లు సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వీటిపై నిహారిక గానీ, చైతన్య గానీ ఎవరూ స్పందించలేదు. గత మూడు నెలలుగా సోషల్‌ మీడియాకు దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ పోస్ట్ పెట్టింది. కలర్‌ఫుల్‌ లంగా ఓణిలో అచ్చమైన తెలుగు అమ్మాయిలా కనిపించింది.

మ్యాచింగ్ గాజులు, ముక్కెర, పెద్ద పెద్ద జుంకాలు… అందమైన జడతో అదిరిపోయే లుక్ లో ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. నిహారిక ఈ ఫొటోలు పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే వైరల్‌ అయ్యాయి. ఈ ఫోటోలపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో నిహారికకు 2.1 మిలియన్ల ఫాలోవర్స్‌ ఉన్నారు.

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

CLICK HERE!! For the aha Latest Updates