
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన తాజా చిత్రం ‘18 పేజస్’. సూర్య ప్రతాప్ పల్నాటి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ త్వరలోనే అందించబోతున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. హీరో నిఖిల్ పుట్టిన రోజు సందర్భంగా జూన్ 1న ఫస్ట్‌లుక్‌ని విడుదల చేస్తున్నట్టు సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. టైటిల్‌తోనే సినిమాపై ఆసక్తి పెంచిన నిఖిల్ తన లుక్‌తో ఎలా ఆకట్టుకుంటారో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు కథ, స్క్రీన్ ప్లే అందిస్తుండటం విశేషం. గీతా ఆర్ట్స్ 2 పతాకంపై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ స్వరాలు సమకూరుస్తున్నారు.ఈ చిత్రంతోపాటు ‘కార్తికేయ 2’ లోనూ నటిస్తున్నాడు నిఖిల్.
1st Look ComingSoon👉🏼#18Pages
#SukumarWritings #AlluAravind #BunnyVas @dirsuryapratap @aryasukku @GeethaArts @GA2Official @SukumarWritings @anupamahere pic.twitter.com/slCyDDiU55— Nikhil Siddhartha (@actor_Nikhil) May 26, 2021













