HomeTelugu Trendingమరోసారి పెళ్లి వాయిదా.. నిరాశలో నిఖిల్‌

మరోసారి పెళ్లి వాయిదా.. నిరాశలో నిఖిల్‌

12 2
కరోనా కారణంగా హీరో నిఖిల్‌ వివాహం మరోసారి వాయిదా పడింది. పల్లవి వర్మ అనే వైద్యురాలితో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న నిఖిల్‌ పెద్దల అంగీకారంతో ఇటీవల నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే వీరి వివాహం ఏప్రిల్‌ 16న జరగాల్సి ఉండగా.. దేశవ్యాప్త లాక్‌డౌన్‌ కారణంగా పెళ్లి వాయిదా పడింది. దీంతో ఇరు కుటుంబాల పెద్దలు మే 14న నిఖిల్‌-పల్లవి వివాహం చేయాలని నిర్ణయించారు. అయితే ఇటీవల లాక్‌డౌన్‌ను మే 17 వరకూ పొడిగిస్తున్నట్లు ప్రకటించడంతో మరోసారి నిఖిల్‌ వివాహం వాయిదా పడింది.

మొదట్లో ఏప్రిల్‌ 16న వివాహం జరిపించాలని మా పెద్దలు నిర్ణయించారు. లాక్‌డౌన్‌ కారణంగా అది మే 14కు వాయిదా పడింది. ఇప్పుడు మళ్లీ లాక్‌డౌన్‌ను మే 17 వరకూ పొడిగించారు. నిరాశకు గురి అయ్యాను. అయితే నా పెళ్లి వల్ల ఏ ఒక్కరికీ ఇబ్బంది వచ్చినా నేను సంతోషంగా ఉండలేను. వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధురమైన జ్ఞాపకం. కాబట్టి అది మంచిగానే ఉండాలని ఆశిస్తున్నాను. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవడం అనేది కరెక్ట్‌ కాదని అనుకుంటున్నాను. కరోనా వైరస్‌ నియంత్రణలోకి వచ్చాక ఘనంగా పెళ్లి చేసుకుంటాను.’ అని ఓ ఆంగ్ల మీడియాతో నిఖిల్‌ అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!