నితిన్ మళ్ళీ అమెరికా వెళ్తున్నాడు!

నితిన్, హనురాఘవపూడి కాంబినేషన్ లో రూపొందుతోన్న ‘లై’ సినిమా కోసం సుమారుగా రెండు నెలల పాటు నితిన్ అక్కడే ఉన్నాడు. అక్కడ చేయాల్సిన సినిమా షూటింగ్ పూర్తి చేసి మళ్ళీ హైదరాబాద్ కు తిరిగివచ్చారు. ఇప్పుడు మరోసారి అమెరికా వెళ్లడానికి రెడీ అవుతున్నాడు ఈ యంగ్ హీరో.  నితిన్ హీరోగా కృష్ణచైతన్య దర్శకత్వంలో ఓ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకొన్న సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్, సుధాకర్ రెడ్డి కలిసి ఈ సినిమాను నిర్మించబోతున్నారు.
త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా షూటింగ్ కొంతభాగం అమెరికాలో చిత్రీకరించాల్సివుంది. దీంతో చిత్రబృందం అమెరికా పయనమవ్వాలని నిర్ణయించుకుంది. దాదాపు 40 రోజుల సుధీర్ఘ షెడ్యూల్ ను అమెరికాలో ప్లాన్ చేస్తున్నారు. ఇది కూడా రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా రూపొందించనున్నారని సమాచారం. ఈ సినిమాలో నితిన్ సరసన ‘లై’ సినిమాలో నటించిన మేఘాఆకాష్ ను హీరోయిన్ గా రిపీట్ చేస్తున్నాడు దర్శకుడు కృష్ణచైతన్య.