ఏం చేసినా.. బిజినెస్ మాత్రం జరగడంలేదు!

కృష్ణవంశీ డైరెక్ట్ చేస్తోన్న తాజా చిత్రం ‘నక్షత్రం’. ఈ సినిమా పోస్టర్లు, సాంగ్ ప్రోమోలు చూస్తుంటే హీరోయిన్లు ఒళ్ళు దాచుకోకుండా కష్టపడుతున్నారనే సంగతి తెలుస్తోంది. రెజీనా, ప్రగ్యాజైస్వాల్ పోటీపడి మరీ తమ అందాల ఆరబోతను ప్రదర్శిస్తున్నారు. ఇక శ్రియ ఐటెమ్ సాంగ్ ఉండనే ఉంది. హీరోయిన్లు ఇంతగా తమ అందాలను ప్రదర్శిస్తున్నా.. సినిమా బిజినెస్ మాత్రం జరగడంలేదు. సాయి ధరం తేజ్ అరగంటపాటు ప్రత్యేక పాత్ర చేసినా.. మార్కెట్ పరంగా సినిమాకు దోహద పడడం లేదు.

సినిమా ట్రైలర్ చూసిన తరువాత కొన్ని అనుమానాలు నెలకొన్నాయి. కృష్ణవంశీ మార్కు శ్రుతిమించిందనే టాక్ వినిపిస్తోంది. అసలే ఈ మధ్య కాలంలో ఆయనకు సరైన హిట్ సినిమా పడలేదు. హీరో సందీప్ కిషన్ కూడా ఫ్లాపుల్లో ఉన్నాడు. ఇలా బిజినెస్ పరంగా సినిమాకు కలిసొచ్చే ఒక్క అంశం కూడా లేకపోవడం మైనస్ అవుతోంది. స్కిన్ షో ఉంటే బయ్యర్లు సినిమా కొంటారని ఆశిస్తే అది కూడా వర్కవుట్ అయ్యేలా కనిపించడంలేదు.