HomeTelugu Trendingఎన్టీఆర్-కొరటాల మూవీ దేవర అప్‌డేట్

ఎన్టీఆర్-కొరటాల మూవీ దేవర అప్‌డేట్

Devara update
యంగ్ టైగర్ ఎన్టీఆర్, –కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న దేవర మూవీపై భారీ అంచనాలున్నాయి. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం అవుతోంది. సైఫ్‌ అలీఖాన్ కూడా తెలుగులో నటిస్తున్న తొలి సినిమా. మెయిన్ విలన్ రోల్ చేస్తున్న సైఫ్ అలీఖాన్‌కు ఈ మూవీలో స్పెషల్ గెటప్ ఉంటుందని తెలుస్తోంది.

యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న దేవర మూవీ కోసం దర్శకుడు కొరటాల శివ ముందుగా యాక్షన్ ఎపిసోడ్స్‌ను షూటింగ్ చేస్తున్నాడు. వీటికి విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్‌ అవసరం కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ కోసం కావాల్సినంత టైమ్ ఉంటుంది. ఏదైనా తేడా వస్తే వెంటనే రీ షూట్ కూడా చేసుకోవచ్చు అని ప్లాన్.

Jhanvi kapoor

అందుకోసమే షూటింగ్ మొదలైనప్పటి నుంచి నాన్ స్టాప్‌గా కేవలం ఫైట్స్ మాత్రమే షూటింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఫైట్స్ వరకు షూటింగ్ పూర్తయిందని తెలుస్తోంది. జూన్ నెలలోనే రెండు భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌ను షూట్ చేశారట. దీంతో యాక్షన్ పార్ట్ పూర్తయిందని అంటున్నారు.

ఆగస్ట్ 15 తర్వాత నుంచి టాకీ పార్ట్ మొదలు కాబోతుందట. హీరోయిన్‌తో పాటు ఇతర నటులతో సీన్స్‌ను అప్పుడే షూట్ చేయబోతున్నారు. ఈ ఏడాది చివరికల్లా పాటలు కూడా పూర్తి చేయనున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్‌ చేస్తున్న సినిమా దేవర. ఆ ఇమేజ్‌కు ఎక్కడా తగ్గకుండా ఈ మూవీని ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!