ఎన్టీఆర్‌,ప్రభాస్‌,కీరవాణి సరదా వాదన.. వైరల్


టాలీవుడ్ ప్రముఖులంతా ఇప్పుడు జైపూర్ లో ఉన్నారు. రాజమౌళి కొడుకు వివాహం జైపూర్లోని ఫెయిర్ మౌంట్ లో అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే. పెళ్లి వేడుకలో ఎన్నో సరదా కార్యక్రమాలు జరుగుతుంటాయి. సెలెబ్రిటీల వివాహంలో జరిగే హంగామా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులో భాగంగా కీరవాణి, ప్రభాస్ ల మధ్య సరదా వాదన ఒకటి ప్రారంభమైంది. ఆడవారి వయసు.. బాహుబలి రెమ్యునరేషన్ అడగొద్దని అంటారు అది నిజమేనా అంటే దానికి ప్రభాస్ అవును అని సమాధానం ఇచ్చారు.

ఈలోగా.. ఎన్టీఆర్ అక్కడికి వచ్చి.. బృందావనంలో మీరు చేశారు అనగానే.. దానికి కీరవాణి లేను పాట మాత్రమే పాడాను అని చెప్పారు. కీరవాణి చెప్పింది వినకుండా మేమే గెలిచాం అని ఎన్టీఆర్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తరువాత ప్రభాస్.. కీరవాణిల మధ్య మాటల వాదన తిరిగి ప్రారంభమైంది. నా మొదటి సినిమా కల్కి. ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. మీ నాన్నగారు అప్పట్లో డబ్బులు ఇవ్వలేదు. కొంత మొత్తం ఇస్తానని చెప్పాడు అని కీరవాణి అనగానే.. మొత్తానికి ఇచ్చాడు కదా సర్ అని చెప్పడంతో అక్కడ ఉన్నవారంతా ఉత్సాహంతో చప్పట్లు కొట్టారు. ఈ వివాహ వేడుకకు దాదాపుగా 300 మంది అతిధులు హాజరవుతున్నారు. అతిధుల కోసం దేశంలోని ఫేమస్ వంటలను సిద్ధం చేస్తున్నారట. మూడు రోజులపాటు కార్తికేయ వివాహం వేడుక జరగబోతున్నది.