HomeTelugu Big Storiesఅదిరిన 'ఎన్టీఆర్‌30' ఫస్ట్‌లుక్‌

అదిరిన ‘ఎన్టీఆర్‌30’ ఫస్ట్‌లుక్‌

Ntr new movie title
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా.. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎన్టీఆర్ 30’. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి టైటిల్ ను అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు దేవర అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ ఇదే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా చిత్రబృందం ఓ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది.

ఈ సినిమా టైటిల్ తో పాటుగా ఫస్ట్ లుక్ ను కూడా అధికారికంగా విడుదల చేశారు. ఈ పోస్టర్ లో చేతిలో కత్తి ఒంటి నిండా రక్తంతో ఉన్న ఎన్టీఆర్ లుక్ అదిరిపోయింది. వెనుక పడవలో శవాల గుట్టను చూస్తేనే ఇది భారీ యాక్షన్ సినిమాగా తెరకెక్కనుందని తెలుస్తోంది. ఈ సినిమా ఫస్ట్‌లుక్ చూసిన ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Image

ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ టాలీవుడ్‌లో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. అలాగే ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ గా కనిపించబోతున్నారు. సైఫ్ అలీఖాన్ కు కూడా ఇదే ఫస్ట్ డైరెక్ట్ తెలుగు సినిమా కావడం గమనార్హం. సైఫ్ అలీఖాన్ సరసన ఈ సినిమాలో నటి చైత్ర రాయ్ కనిపించబోతుందట. ఈ సినిమాలో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కూడా కీలక పాత్రలో నటించబోతున్నారు.

అనిరుధ్ రవిచందర్ దేవర సినిమాకు సంగీతం అందిస్తున్నారు. హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ ఆక్వామ్యాన్ వంటి సినిమాలకు పని చేసిన బ్రాడ్ మినిచ్ వీఎఫ్ఎక్స్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కల్యాణ్ రామ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2024 ఏప్రిల్ 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను విడుదల కానుంది.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!