గుణశేఖర్‌ తో రానా ‘హిరణ్యకశ్యప’

ప్రముఖ దర్శకుడు గుణశేఖర్‌ తన తదుపరి ప్రాజెక్టును ప్రకటించారు. ‘రుద్రమదేవి’ చిత్రం తర్వాత విరామం తీసుకున్న ఆయన ‘హిరణ్యకశ్యప’ అనే టైటిల్‌తో సినిమా తెరకెక్కించనున్నారు. ఇందులో రానా హీరో పాత్ర పోషించడం విశేషం. ఈ మేరకు శనివారం ప్రకటన చేశారు. రానాతో కలిసి ఎగ్జైటింగ్‌ ప్రయాణం మొదలైందని గుణశేఖర్‌ ట్వీట్‌ చేశారు. గత మూడేళ్లుగా ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయని అన్నారు. త్వరలోనే పూర్తి వివరాల్ని వెల్లడిస్తామని చెప్పారు.

ప్రహ్లాదుడి తండ్రి హిరణ్యక‌శ్యప‌. విష్ణుమూర్తి ద్వేషి అయిన ఈ రాక్షస‌రాజు సంహారం కోస‌మే మ‌హా విష్ణువు న‌ర‌సింహ అవ‌తారం ఎత్తారు. ఇప్పుడు ఈ పౌరాణిక కథతో గుణశేఖర్‌ సినిమా తీయబోతున్నట్లు తెలుస్తోంది.