HomeTelugu Trendingహీరోగా తేజ సజ్జ ఎంట్రీ.. హీరోయిన్‌గా శివానీ రాజశేఖర్

హీరోగా తేజ సజ్జ ఎంట్రీ.. హీరోయిన్‌గా శివానీ రాజశేఖర్

Oh baby fame teja sajja t 1

చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాల్లో మెప్పించాడు నటుడు తేజ సజ్జా. గత ఏడాది ‘ఓ బేబీ’ సినిమాలో కీలక పాత్రలో నటించాడు తేజ. ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. తేజా ఇప్పుడు శివానీ రాజశేఖర్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మల్లిఖార్జున్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రశాంత్ వర్మ స్టోరీ అందించగా రథన్ సంగీతం సమకూర్చారు. మహాతేజా క్రియేషన్స్ బ్యానర్ పై చంద్ర శేఖర్ మొగుల్ల మరియు ఎస్.ఒరిజినల్స్ సృజన్ యరబోలు కలిసి నిర్మిస్తున్న ఈ మూవీ నుండి తాజాగా హీరో తేజ సజ్జా లుక్ విడుదలైంది. నేడు (ఆదివారం) తేజ పుట్టిన రోజు సందర్భంగా సినిమా నుంచి అతని లుక్ ని విడుదల చేస్తూ చిత్ర యూనిట్ శుభాకాంక్షలు తెలిపింది.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ‘మా మహతేజ క్రియేషన్స్ బ్యానర్ మీద ‘‘ఎస్ ఒరిజనల్స్’’ తో కలిసి ప్రొడక్షన్ నెంబర్ 1 గా ఈ సినిమా నిర్మిస్తున్నాం. ఫాంటసీ లవ్ స్టోరీ నేపథ్యంలో ఈ కథ అంతా జరుగుతుంది. దర్శకుడు మల్లిక్ రామ్ చెప్పిన కథకు అందరం కనెక్ట్ అయ్యాం.. ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మించాం. మూవీ చాలా బాగా వచ్చింది. తేజ,శివానీ రాజశేఖర్ ఇందులో హీరో,హీరోయిన్‌లు నటిస్తున్నారు ..షూటింగ్ అంతా పూర్తి అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులు చక్కబడిన తర్వాత మూవీని విడుదల చేస్తాం’’అన్నారు. ఈ సినిమాలో తులసి, శివాజీ రాజా, సత్య,మిర్చి కిరణ్,దేవీ ప్రసాద్ తదితరులు నటిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!