HomeTelugu Big Storiesబిగ్‌బాస్ విన్నర్‌పై పోల్స్‌.. టాప్‌లో కౌశల్‌.. ఫినాలే చీఫ్ గెస్ట్ వెంకీ!

బిగ్‌బాస్ విన్నర్‌పై పోల్స్‌.. టాప్‌లో కౌశల్‌.. ఫినాలే చీఫ్ గెస్ట్ వెంకీ!

4a 6తెలుగు బిగ్ బాస్ సీజన్‌-2 చివరి దశకు చేరుకుంది. ఈ ఆదివారంతో బిగ్ బాస్ 2 కు శుభం కార్డు పడుతుంది. టైటిల్ బరిలో ఎవరు నిలుస్తారు అనే దానిపై ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. కౌశల్, సామ్రాట్, తనీష్, దీప్తి, గీతా మాధురిలు ఫైనల్స్ కు చేరుకోగా, కౌశల్ గెలిచే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కౌశల్ కు దీప్తి నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉన్నట్టు కనిపిస్తున్నది.

ఇక ఫైనల్స్ విజేతను ఎవరు ప్రకటిస్తారు అనే దానిపై ఆద్యంతం ఉత్కంఠతను రేకిస్తున్నది. నాగార్జున వస్తాడని అనుకున్నా.. సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో.. నాగ్ ఫ్యామిలీతో కలిసి వెకేషన్ ట్రిప్ కు వెళ్ళాడు. ఎన్టీఆర్ అరవింద సమేత బిజీలో ఉన్నాడు. ఈ సమయంలో తారక్ కు ప్రతి నిమిషం కూడా విలువైనదే. ఎన్టీఆర్ రావడం కష్టమే. ఇలాంటి సమయంలో మరో పేరు తెరమీదకు వచ్చింది.

4 30

విక్టరీ వెంకటేష్ బిగ్ బాస్ 2 ఫైనల్స్ చీఫ్ గెస్ట్ గా వచ్చి విజేతను ప్రకటిస్తారని తెలుస్తున్నది. ఫైనల్స్ లో విజేతకు రూ.50 లక్షల రూపాయల బహుమతిని బహుకరిస్తారు. ఒక కేవలం ఫినాలేకి ఒక్క రోజు ఉండడంతో కౌశలే విజేత అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. అంతే కాదు వివిధ మీడియా సంస్థలు బిగ్ బాస్ విన్నర్ ఎవరన్న దానిపై ఒపీనియన్ పోల్స్ నిర్వహించగా.. కౌశల్‌కి ఊహించని స్థాయి ఓటింగ్ రావడం.. మిగిలిన కంటెస్టెంట్స్ ఆయన దరిదాపుల్లో కూడా లేకపోవడం కౌశల్ ఆర్మీ పెద్ద ఎత్తున విజయోత్సవాలకు రెడీ అవుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!