ఆసక్తికరంగా వకీల్‌సాబ్‌ ట్రైలర్‌‌

Power Star #PawanKalyan​’s #VakeelSaabTrailer
పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న తాజా చిత్రం వకీల్‌సాబ్‌. శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శృతిహాసన్‌, నివేదా థామస్‌, అంజలి, అనన్య నాగళ్ల ముఖ్య పాత్రలు పోషించారు. ఈ మూవీ ట్రైలర్‌ ను తాజాగా విడుదల చేశారు. హైదరాబాద్‌ సహా వివిధ జిల్లాల్లోని థియేటర్‌లలో వకీల్‌సాబ్‌ ట్రైలర్‌ను ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా థియేటర్ల వద్ద పవన్‌ అభిమానుల కోలాహలం నెలకొంది. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకం దిల్‌రాజు, శిరీశ్‌ నిర్మిస్తున్నారు. బోనీకపూర్‌ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్‌ 9న విడుదల కాబోతుంది.

CLICK HERE!! For the aha Latest Updates