రజనీకాంత్‌ త్వరగా కోలుకోవాలి: పవన్‌ కళ్యాణ్‌


సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ అస్వస్థతతో హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. దీని పై పవర్‌ స్టార్‌ పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆ తర్వాత కరోనా లక్షణాలు లేవని వైద్యులు ప్రకటించడం ఊరటనిచ్చింది అని మనోధైర్యం మెండుగా ఉన్న రజనీకాంత్ గారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అని పేర్కొన్నారు. ఆధ్యాత్మికపరులైన ఆయనకు భగవదనుగ్రహం కలగాలి. ఆయన ఎంతగానో విశ్వసించే మహావతార్ బాబాజీ ఆశీస్సులతో సంపూర్ణ ఆరోగ్యంతో మన ముందుకు రావాలని కోరుకొంటున్నాను అని తెలిపారు. అయితే ఈ రోజు ఉదయం రక్తపోటు అధికం కావడంతో రజినీని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు సిబ్బంది. ప్రస్తుతం రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని సాయంత్రానికి డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.

CLICK HERE!! For the aha Latest Updates