HomeTelugu Trendingమొదటి సారి ఇలా చేశాడు!అకీరా చేసిన మంచి పనికి ఫిదా అవుతోన్న ఫ్యాన్స్‌ ...

మొదటి సారి ఇలా చేశాడు!అకీరా చేసిన మంచి పనికి ఫిదా అవుతోన్న ఫ్యాన్స్‌ …

Akira Nandan Blood Donation

రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఏమీ ఉండదు. తన పిల్లల గురించి ఎప్పుడూ చెబుతుంటుంది. ఆద్య, అకీరాల గురించి చెబుతూ రేణూ దేశాయ్ షేర్ చేసే పోస్టులు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. ఇక రేణూ దేశాయ్ లైవ్‌లోకి వచ్చినా కూడా అందరూ అకీరా నందన్ విషయాలే అడుగుతుంటారు.ఇక అకీరా నందన్ సినీ ఎంట్రీ మీద అయితే లెక్కలేనన్ని పుకార్లు వచ్చేశాయి. అకిరా బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తోన్న వీడియోను రేణూ దేశాయ్ షేర్ చేసింది. అది కాస్త ట్రెండ్ అవ్వడంతో అకీరా నందన్ సినీ ఎంట్రీ గురించి చాల ప్రశ్నలు రావడంతో, రేణు దేశాయ్ అకీరా సినిమాల్లోకి రావడం లేదు, గెస్ట్ పాత్రలు వేయడం లేదు, ఎక్కడా కూడా పాటలు పాడటం లేదు అని క్లారిటీ ఇచ్చింది.

తాజాగా రేణు దేశాయ్ ఓ పోస్ట్ చేసింది అందులో అకీరా నందన్ మొదటి సారిగా రక్త దానం చేశాడంటూ చెప్పుకొచ్చింది. 18 ఏళ్లు నిండటంతో ఇలా ఫస్ట్ టైం బ్లడ్ డొనేట్ చేస్తున్నాడంటూ తెలిపింది. పద్దెనిమిదేళ్లు నిండిన తరువాత రక్త దానం చేయండి.. మనం ఇచ్చే రక్తం వల్లే ఎవరో ఒకరి ప్రాణాలను కాపాడినట్టు అవుతుందంటూ రేణూ దేశాయ్ చెప్పుకొచ్చింది. రక్తం అనేది చాలా గొప్పది.. ఒకరికి అవసరం ఉందంటే మనం ఇవ్వగలిగేది రక్తమేనంటూ రేణూ దేశాయ్ చెప్పుకొచ్చింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!