అకీరా న్యూ ట్యాలెంట్‌ .. వీడియో వైరల్‌

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ టాలీవుడ్‌ ఎంట్రీ కోసం మెగా ఫ్యాన్స్‌ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే అతిత్వరలోనే అకీరా హీరోగా అరంగేట్రం చేయనున్నట్లు వినికిడి. ఇప్పటికే రేణుదేశాయ్ కూడా తన పిల్లలు సినిమారంగంలో ఎంట్రీ ఇస్తానంటే వాళ్ళ ఇష్టమని, ఈ విషయంలో తనకేమీ అభ్యంతరం లేదని చెప్పేసింది. తాజాగా అకీరాకు సంబంధించిన ఓ ఇంటరెస్టింగ్ వీడియోను రేణూదేశాయ్ షేర్ చేసింది. ఈ వీడియోలో అకీరా కర్రసామును చేస్తూ కన్పించాడు. అతను వీడియోలో చాలా షార్ప్‌గా, పట్టుతో కర్రసాము చేయడం చూస్తుంటే అందులో బాగానే నైపుణ్యం సాధించినట్టున్నాడు. పవన్ సినిమాల్లోకి వచ్చే సమయంలో కూడా మార్షల్ ఆర్ట్స్ కు సంబంధించిన విద్యను అభ్యసించిన విషయం తెల్సిందే. దీంతో మరోసారి అకీరా ఎంట్రీ పై పవన్‌ ఫ్యాన్స్‌లో చర్చ మొదలైంది.

 

View this post on Instagram

 

A post shared by renu (@renuudesai)

CLICK HERE!! For the aha Latest Updates