పుట్టినరోజు కల్యాణ్‌ దేవ్.. ఎంత గొప్ప పని చేశాడో తెలుసా!

మెగాస్టార్‌ చిరంజీవి అల్లుడు, సినీ నటుడు కల్యాణ్‌ దేవ్‌.. ఈరోజు కోసమే ఎదురుచూస్తున్నానని అంటున్నారు. ఈరోజు కల్యాణ్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా అవయవ దానం చేయాలని కల్యాణ్ నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ ద్వారా వెల్లడించారు. ‘ఈరోజు కోసమే ఎదురుచూస్తున్నాను. ట్విటర్‌లో ఉండటం సులువే కానీ ఏదన్నా విలువైన అంశంతో ఈ ట్విటర్ ప్రయాణాన్ని మొదలుపెట్టాలనుకున్నాను. అందుకే నా వంతుగా అపోలో ఆస్పత్రి ఆధ్వర్యంలో అవయవదానం చేశాను. ఎంతైనా మనం పోయేటప్పుడు ఏమీ తీసుకుపోం కదా.. ప్రేమతో మీ కల్యాణ్‌ దేవ్‌’ అని పేర్కొంటూ ఫొటోలను పోస్ట్‌ చేశారు.

‘విజేత’ చిత్రంతో కల్యాణ్‌ హీరోగా టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మిశ్రమ ఫలితాలను అందుకుంది. ఈరోజు ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని కొత్త సినిమా లుక్‌ను విడుదల చేశారు. లుక్‌లో ఆయన సంతోషంతో స్టెప్పులేస్తున్నట్లుగా కనిపించారు. ఈ చిత్రానికి పులి వాసు దర్శకత్వం వహించనున్నారు. రిజ్వాన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తోంది. తమన్‌ సంగీతం అందించనున్నారు.