జగన్ ఆహ్వానంపై స్పందించిన చిరంజీవి.. మిగిలింది పవనే‌?

మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ సినిమా బిజీలో ఉన్నాడు. సినిమా షూటింగ్ చివరిదశలో ఉన్నది. మరోవైపు నిర్మాణాంతర కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. చిరంజీవి సినిమాలపైనే పూర్తి దృష్టి సారించారు. ఖైదీ నెంబర్ 150 ఇచ్చిన కిక్ తో మరోమారు వెండితెరపై తిరుగులేని తారగా వెలిగేందుకు మెగాస్టార్ సిద్ధం అవుతున్నాడు. ఎన్నికల్లో విజయం సాధించిన జగన్ తన ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరు కావాలని జగన్ ఫోన్ చేసి అడిగాడట. అయితే, తాను రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నానని, హాజరు కాలేనని చెప్పేశాడు. ప్రవేట్ గా కలిసి మాట్లాడేందుకు అపాయింట్మెంట్ అడిగినట్టు తెలుస్తోంది.

పవన్ కు కూడా జగన్ ఆహ్వానం పంపారు. రాజ్యాంగ బద్దమైన వేడుక కావడంతో హాజరు కావడం ఆనవాయితీ. వచ్చినా రాకున్నా ఏమీకాదు. వస్తే గౌరవించినట్టు ఉంటుంది. ఇప్పుడు పవన్ .. వైఎస్ జగన్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరౌతారా లేదా అన్నది తెలియాలి.

CLICK HERE!! For the aha Latest Updates