రచ్చరచ్చ చేస్తున్న ‘రజినీ’ మాస్ సాంగ్ మేకింగ్ వీడియో

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్, ప్రముఖ దర్శకుడు శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన 2పాయింట్ 0 సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. సినిమాకు భారీ స్థాయిలో కలెక్షన్లు రాబట్టుతుండంతో.. రజనీ నెక్స్ట్ సినిమా ‘పెట్ట’ పై అంచనాలు పెరిగాయి. పెట్ట సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఈ నెల 9 వ తేదీన ఆడియో వేడుక కూడా జరగబోతున్నది . అదే రోజు ట్రైలర్‌నూ విడుదల చేయనున్నారు.

జనవరి 11 వ తేదీన సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు యువ సంగీత దర్శకుడు.. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులోని ఫస్ట్ సింగిల్ మారానా మాస్ సాంగ్ ఈ సాయంత్రం 6 గంటలకు రిలీజ్ కాబోతున్నది. ఈ సాంగ్ మేకింగ్ వీడియోను సన్ పిక్చర్స్ సంస్థ ట్విట్టర్ లో రిలీజ్ చేసింది. ఈ చిన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తున్నది.

CLICK HERE!! For the aha Latest Updates