HomeTelugu Trendingబోనీకపూర్‌ సినిమాకు పైరసీ చిక్కులు!

బోనీకపూర్‌ సినిమాకు పైరసీ చిక్కులు!

3 7
దివంగత నటి శ్రీదేవి భర్త, ప్రముఖ హిందీ చిత్ర నిర్మాత భోనీకపూర్‌ తమిళంలో నిర్మించిన తొలి చిత్రం ‘నేర్కొండ పార్వై’ ను పైరసీ వెంటాడుతోంది. ఈచిత్రంలో స్టార్‌ నటుడు అజిత్‌ హీరోగా నటి విద్యాబాలన్, శ్రద్ధాశ్రీనాథ్, అభిరామి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. హిందీ చిత్రం పింక్‌కు రీమేక్‌ ఇది. హెచ్‌.వినోద్‌ దర్శకత్వం వహించారు. రెండు రోజుల నుంచే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీమియం షోలను ప్రదర్శించారు. విదేశాల్లోనూ విడుదల చేశారు. చిత్రానికి మంచి స్పందన వచ్చింది. అజిత్‌ నటనకు ప్రశంసలు వస్తున్నాయి.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సినీ ప్రేక్షకులను ఎంతగా రంజింపజేస్తుందో, సినీ నిర్మాతలు, పంపిణీదారులు, థియేటర్ల యాజమాన్యాన్ని ఘోరంగా ముంచేస్తోంది. పైరసీదా రులను ఎవరూ అరికట్టలేని పరిస్థితి. కొత్త చిత్రం తెరపైకి రాక ముందే అక్రమంగా వెబ్‌సైట్స్‌లో వచ్చేస్తున్నాయి. ఎన్నో కోట్లు ఖర్చు చేసి నిర్మిస్తున్న చిత్రాలకు వందల మంది శ్రమ, కృషి ఉంటుందని, వందల మంది జీవనం సినిమా అని అలాంటి సినిమాను క్షణాల్లో అక్రమంగా దోచుకుంటున్నారని నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గురువారం విడుదలకు సిద్ధం చేసిన నేర్కొండపార్వై సినిమా విడుదలకు రెండు రోజుల ముందే వెబ్‌సైట్లలో వైరల్‌ అవుతోంది. ఇలా విడుదలకు ముందే కొత్త చిత్రం ఇంటర్నెట్లలో ప్రసారం అవుతుంటే ఎగ్జిబిటర్లు చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయడానికి ముందుకు రారని, అజిత్‌ వంటి పెద్ద హీరో చిత్రానికే ఈ గతి పడితే చిన్న చిత్రాల పరిస్థితి ఏంటని సినీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.

నేర్కొండ పార్వై చిత్రాన్ని పైరసీ నుంచి కాపాడడానికి నిర్మాత భోనీకపూర్‌ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ముందుగా చెన్నై హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అందులో నేర్కొండ పార్వై చిత్రానికి సంబంధించిన అన్ని హక్కులు తమకే చెంది ఉన్నాయని చిత్రాన్ని వెబ్‌సైట్లలో అక్రమంగా ప్రసారం కాకుండా నిషేధించాలని ఆ పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం నేర్కొండ పార్వై చిత్రాన్ని వెబ్‌సైట్లలో ప్రసారంపై నిషేధం విధిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు సుమారు 1129 వెబ్‌సైట్స్‌ మూసివేతకు ఆదేశాలిచ్చింది. అయినా కోర్టు ఆదేశాలను లెక్కచేయకుండా విడుదలకు రెండు రోజుల ముందే నేర్కొండ పార్వై చిత్రం వెబ్‌సైట్స్‌లో విడుదలైందని వాపోతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu