మురుగదాస్‌ను అరెస్ట్‌కు ప్రయత్నిస్తున్న’సర్కార్‌’?

ప్రముఖ డైరెక్టర్‌ మురుగదాస్‌ను అరెస్ట్‌ చేసేందుకు చెన్నై పోలీసులు నిన్న రాత్రి ఆయన ఇంటికి వచ్చారు. సర్కార్‌ సినిమా వివాదానికి సంబంధించి కొందరు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా జయలలితను అవమానపరిచేందుకు తీసిన చిత్రంగా అన్నా డీఎంకే నేతలు విమర్శిస్తున్నారు. రాత్రి మురుగదాస్‌ ఇంటికి వచ్చి పోటీసులు ఆయన కోసం విచారించారు. ఆయన ఇంట్లో లేరని చెప్పడంతో వెళ్ళిపోయారని మురగదాస్‌ స్వయంగా ట్వీట్‌ చేశారు. ‘నిన్న రాత్రి పోలీసులు నా ఇంటికి వచ్చి పలు మార్లు బెల్‌ రింగ్‌ చేశారు. నేను ఇంట్లో లేకపోవడంతో వారు వెళ్ళిపోయారు. ఇపుడు నా ఇంటి వద్ద పోలీసులు ఎవరూ లేరని తెలిసింద’ని మురుగదాస్‌ ట్వీట్‌ చేశారు. మురుగదాస్‌ను అరెస్ట్‌ చేసేందుకు చెన్నై పోలీసులు ప్రయత్నించారని సర్కార్‌ సినిమా నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌ వెల్లడించింది.