HomeTelugu Big Storiesవయ్యారాల బొమ్మ.. 'క్యారెట్ హల్వా'.. వైరల్‌

వయ్యారాల బొమ్మ.. ‘క్యారెట్ హల్వా’.. వైరల్‌

3 4
టాలీవుడ్‌లో హీరోయిన్‌గా దూసుకుపొతున్న వారిలో పూజా హెగ్డే ఒకరు. స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కు జంటగా ‘డీజే’ నటించింది. ఈ సినిమాలో తన అందాలతో అదరగొట్టిన ఈ ఈ హాట్‌ బ్యూటీ. ఎన్టీఆర్‌ ‘అరవింద సమేత’, మహేష్‌ తో ‘మహర్షి’, బన్నితో ‘అలవైకంఠపురములో’ నటించి అదిరిపోయే స్టార్‌ హీరోయిన్‌ల లిస్ట్‌లో చేరిపోయింది ఈ అమ్మడు. అయితే కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్‌ నేపధ్యంలో సామాన్య ప్రజలు నుంచి సెలెబ్రిటీల వరకు అందరు ఇళ్లకే పరిమితమౌతున్నారు. అందులో భాగంగా కొందరు గరిట పడుతుంటే.. మరికొందరు వారివారి పనుల్లో బీజీగా ఉన్నారు. అందులో భాగంగా పూజా హెగ్డే కూడా ఇంటి పట్టునే ఉంటూ.. తనకు ఇష్టమైన వంటలను రుచి చూస్తోంది. తాజాగా ఆమె క్యారెట్ హల్వా తయారు చేసింది. అంతేకాదు సూపర్ యమ్మీ అంటూ దానికి సంబందించిన ఓ ఫోటోను అభిమానులతో పంచుకుంది. ఇక ఈ ఫొటోలను చూసిన ఓ నెటిజన్స్.. పూజాను ‘మాస్టర్ చెఫ్’ అంటూ పొగడ్తలతో ముంచేత్తున్నారు.

ఇక వరుస హిట్లతో ఊపు మీద ఉన్న ఈ ముద్దుగుమ్మ మరో అవకాశాన్ని అందుకుంది. తమిళ్‌లో అదిరిపోయే ఆఫర్‌ అందుకున్నట్లు తెలుస్తోంది. సూర్య, దర్శకుడు హరి కాంబినేషన్‌లో ఓ చిత్రం వస్తోంది. ఈ సినిమాలో సూర్య కి జంటగా పూజ హెగ్డే ని తీసుకొనే ఆలోచనలో ఉందట మూవీ యూనిట్‌. అంతేకాదు దాదాపు పూజ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించడం ఖాయం అని తెలుస్తుంది. ఇక పూజా ప్రస్తుతం ప్రభాస్ సరసన ఓ సినిమా చేస్తోంది. దాంతో అఖిల్ హీరోగా వస్తోన్న మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ అనే సినిమాలోను నటిస్తోంది. వీటికి తోడు హిందీలో సల్మాన్‌తో పాటు అక్షయ్ సినిమాలో కూడా పూజా నటించనుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!