బిగ్‌బాస్‌ సీజన్‌-4లో నాగార్జున హీరోయిన్‌!


బుల్లితెర అతిపెద్ద రియాల్టీ షో ‘బిగ్‌బాస్’కు తెలుగులో మంచి క్రేజ్‌ ఉంది. ఇప్పటికే 3 సీజన్లు పూర్తి చేసుకుంది. ఇక సీజన్‌-4 కోసం సన్నాహకాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. కరోనా ఎఫెక్ట్‌ లేకపోయి ఇప్పటీకే ‘బిగ్‌బాస్-4’ అఫీషియల్ క్లారిటీ వచ్చేది. ఇక సీజన్-4 లో స్టార్ సెలబ్రెటీస్ ని దింపనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎక్కువగా గ్లామర్ ఉండటంతో పాటు వివాదాస్పదం ఉంటేనే షో కు రేటింగ్ వస్తుంది నిర్వాహకులు భావిస్తున్నారట. తాజా సమాచారం ప్రకారం నాగార్జున హీరోగా నటించిన బాస్ చిత్రంలో ఒక హీరోయిన్ గా నటించి ‘పూనమ్ భజ్వాతో’ నిర్వాహకులు చర్చలు జరిపారట. ఒక హీరోయిన్ గా నటించి మెప్పించిన ఈమె ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో నటించినా కూడా పెద్దగా క్రేజ్ రాలేదు. ఇక ఐటెమ్‌ సాంగులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ముద్దుగుమ్మ హంసా నందినిని కూడా ఈ సీజన్ కోసం సంప్రదించారట. వీరిద్దరితో పాటు మరో హాట్‌ బ్యూటీ శ్రద్దా దాస్‌ను కూడా రంగంలోకి దించాలని నిర్వాహకులు ప్రయత్నాలు చేస్తున్నారట ఇక ఈ సీజన్‌లో బిత్తిరి సత్తి, హీరో తరుణ్‌, మంగ్లీ కూడా సెలక్ట్‌ అయ్యారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సీజన్‌లో ప్రేక్షకులకు ఫుల్‌గా అందాల విందు ఉండబోతుందన మాట.

CLICK HERE!! For the aha Latest Updates