రాక్ స్టార్ షోకి హోస్ట్ గా ప్రభాస్..!

హాలీవుడ్ రాక్ స్టార్ పాప్ సింగర్ బ్రియాన్ ఆడమ్స్ చాలా కాలం తరువాత ఇండియా రాబోతున్నాడు. ఇండియాలో మూడు చోట్ల ప్రదర్శన ఇవ్వబోతున్నట్టు తెలుస్తున్నది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. అక్టోబర్ 9 న గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరగబోతున్నది. అక్టోబర్ 11 న హైదరాబాద్లోని హైటెక్స్ లో రాక్ స్టార్ బ్రియాన్ ఆడమ్స్ షో జరగబోతున్నది. ఇక అక్టోబర్ 12 న ముంబైలో షో జరుగుతుంది. హైదరాబాద్ లో జరిగే రాక్ స్టార్ బ్రియాన్ ఆడమ్స్ షోలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హోస్ట్ గా వ్యవహరించబోతున్నట్టు సమాచారం. అలాగే ముంబైలో జరిగే షోకు బిగ్ బి అమితాబ్ హోస్ట్ గా వ్యవహరిస్తారని తెలుస్తున్నది.