చిరు, సురేందర్ రెడ్డిల కథ అదే..!

మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రీఎంట్రీలో ఇండస్ట్రీ హిట్ కొట్టిన చిరు ఇప్పుడు సినిమాలతో బిజీ అవ్వాలని వరుస ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టాడు. ప్రస్తుతం రామ్ చరణ్ నిర్మాణంలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. నిజానికి సురేందర్ రెడ్డి ఇప్పటికే ఓ లైన్ ను చిరుకి చెప్పడం దానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయి. అయితే తాజాగా సురేందరెడ్డికి ఓ కథను ఇచ్చి డైరెక్ట్ చేయమని చెప్పాలనే ఆలోచనలో మెగా క్యాంప్ ఉన్నట్లు తెలుస్తోంది.

రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి ‘ఉయ్యలవాడ నరసింహారెడ్డి’ కథను సినిమాగా చేయాలనుకుంటునట్లుగా వెల్లడించారు. ఆ కథను డైరెక్ట్ చేయబోయేది సురేందర్ రెడ్డి అని తెలుస్తోంది. పరుచూరి బ్రదర్స్ సిద్ధం చేస్తోన్న ఈ స్క్రిప్ట్ పూర్తవ్వగానే సెట్స్ పైకి తీసుకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. సురేందర్ రెడ్డి ఈ చారిత్రక నేపధ్యం గల సినిమాను హ్యాండిల్ చేయగలడని నమ్మే ఆయనను ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. మరి దీనికి సురేందర్ రెడ్డి ఎలా రియాక్ట్ అవుతాడో.. తన సొంత కథనే డైరెక్ట్ చేస్తానని అంటాడేమో చూడాలి. అయినా.. చిరంజీవి అడిగితే కాదనగలిగే ధైర్యం సురేందర్ రెడ్డికి లేదనే చెప్పాలి!