అనాధలను దత్తత తీసుకున్న దిల్ రాజు


తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా, ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన ముగ్గరు చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారారు. ఏడాది క్రితం తండ్రిని కోల్పోయిన చిన్నారులు, రెండురోజుల క్రితం అనారోగ్యంతో తల్లికూడా మరణించింది. దీంతో ముగ్గురు చిన్నారులు అనాథలయ్యారు. దీనిపై పలు టీవీ ఛానళ్లలో వచ్చిన కథనాలకు పలువురు స్పందించారు. ఎంతోమందికి ఆపన్నహస్తం అందించి రియల్ హీరోగా మన్ననలు అందుకుంటున్న సోనూసూద్ స్పందించారు. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులను ఆదుకుంటానని ట్విట్టర్ ద్వారా తెలిపారు. సినీ, రాజకీయ ప్రముఖులు సైతం ఆ పిల్లలకు అండగా నిలుస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఆ చిన్నారులను దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చారు.

CLICK HERE!! For the aha Latest Updates