పూరి డైరెక్షన్‌లో రామ్‌.. సహ నిర్మాతగా ప్రముఖ నటి..!

డైరెక్టర్‌ పూరి జగన్నాథ్ త్వరలో సొంత నిర్మాణ సంస్థలో సినిమా ప్రారంభించనున్నాడు. ఎనర్జిటిక్‌ హీరో రామ్‌తో పూరి ఓ సినిమాను ప్రారంభించనున్నాడు. ఈ సినిమా 2019 జనవరిలో ప్రారంభించి మేలో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. పూరి భార్య లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్‌ టూరింగ్ టాకీస్‌ బ్యానర్‌పై ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాకు హీరోయిన్‌ ‘చార్మీ’ సహ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో ఉన్న ఈ చిత్రం ఎలా ఉండబోతుంది, ఇతర నటీనటులెవరు అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.