‘రొమాంటిక్‌’ తో ఆకాశ్‌ పూరి

డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ కుమారుడు ఆకాశ్‌ పూరీ మూడో సినిమా ఖరారైంది. ఈ చిత్రానికి ‘రొమాంటిక్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ చిత్రబృందం ఆకాశ్‌కు సంబంధించిన ఫొటోను సోషల్‌మీడియాలో విడుదల చేసింది. ఈ సినిమాకు అనిల్‌ పాడూరి దర్శకత్వం వహించనున్నారు. పూరి జగన్నాథ్ స్క్రీన్‌ ప్లే, డైలాగులు, కథ అందించనున్నారు. పూరీ కనెక్ట్స్‌ బ్యానర్‌పై ఆయనే నిర్మాతగా వ్యవహరించనున్నారు. త్వరలో సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు ప్రకటిస్తామని తెలిపారు. ఈరోజు పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ప్రముఖ నటుడు కల్యాణ్‌ రామ్‌ పాల్గొన్నారు. మంగళవారం నుంచి సినిమా చిత్రీకరణ ప్రారంభం కానున్నట్లు ఆకాశ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు.

గతేడాది ‘మెహబూబా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఆకాశ్‌. ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహించారు. పునర్జమ్మ, ప్రేమకథా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మిశ్రమ ఫలితాలను అందుకుంది. ఇప్పుడు ఆకాశ్‌ నటించబోయే మూడో చిత్రం కూడా ప్రేమకథ నేపథ్యంతోనే తెరకెక్కుతున్నట్లు టైటిల్‌ను బట్టి తెలుస్తోంది. ఈ సినిమా అయినా ఆకాశ్‌కు మంచి హిట్‌ ఇస్తుందో లేదో వేచి చూడాలి.