పూరీ స్పీడ్ తగ్గేలా లేదు!

హీరో ఎవరైనా సరే తన స్పీడ్ మాత్రం తగ్గేదే లేదన్నట్లు చేస్తున్నాడు దర్శకుడు పూరీజగన్నాథ్. బాలయ్యతో పూరీ సినిమా అనౌన్స్ చేసి నెల రోజులు కూడా కాలేదు అప్పుడే సినిమా మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసినట్లుగా వెల్లడించారు. ఈ సినిమా కోసం వేసిన భారీ సెట్ లో తొలి షెడ్యూల్ ను పూర్తి చేశామని, యాక్షన్ సీక్వెన్సెస్ తెరకెక్కించామని ప్రకటించారు పూరీ. ఆయన ఇంత స్పీడ్ గా సినిమా తీస్తుండడం బాలయ్య అభిమానులకు ఆనందాన్నిస్తుంది.

దీన్ని బట్టి పూరీ మొదట ప్రకటించినట్లుగా సెప్టెంబర్ 29న ఎట్టిపరిస్థితుల్లో ఈ సినిమా రిలీజ్ చేస్తాడనే నమ్మకంతో ఉన్నారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ సినిమాకు టపోరి అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా ఇంకా ఎవరినీ ఫైనల్ చేయలేదు. అంతేకాదు మిగిలిన నటీనటులు ఎవరో కూడా తెలియదు. అంతలోనే సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేయడం విశేషమనే చెప్పాలి.