HomeTelugu Trendingవరల్డ్ బ్యాడ్మింటన్‌లో సెమీస్ చేరిన పీవీ సింధు

వరల్డ్ బ్యాడ్మింటన్‌లో సెమీస్ చేరిన పీవీ సింధు

15 2భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మరో అరుదైన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. స్విట్జర్లాండ్‌లోని బాసెల్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ ప్రీక్వార్టర్స్‌ ఆమె అద్భుత ప్రదర్శన కనబరిచింది. మహిళల సింగిల్స్‌లో భాగంగా శుక్రవారం చైనీస్ తైపీ షట్లర్ తైజు యింగ్‌తో ఢీకొన్న పీవీ సింధు 12-21, 23-21, 21-19 తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో ఆమె సెమీస్‌లో అడుగుపెట్టింది. నిన్న జరిగిన ప్రిక్వార్టర్స్‌ మ్యాచ్‌లో ఆమె 21-14, 21-6తో తొమ్మిదో సీడ్‌ బీవెన్‌ జాంగ్‌ (అమెరికా)పై అలవోక విజ
యాన్ని సాధించిన విషయం తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!