HomeTelugu Trending‘సినతల్లి’కి ఇల్లు నిర్మించి ఇస్తా: రాఘవ లారెన్స్‌

‘సినతల్లి’కి ఇల్లు నిర్మించి ఇస్తా: రాఘవ లారెన్స్‌

Raghava lawrence promises h

కోలీవుడ్‌ స్టార్‌ హీరో సూర్య నటించిన చిత్రం‘జై భీమ్’. 28 ఏళ్ల క్రితం జరిగిన వాస్తవ ఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా దేశవ్యాప్తంగా హిట్ టాక్ సంపాదించుకుంది. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. తాజాగా ఈ సినిమాను చూసిన ప్రముఖ దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ స్పందించాడు. దర్శకుడు జ్ఞానవేల్‌పై ప్రశంసలు కురిపించారు. ఆయనను మనసారా అభినందిస్తున్నట్టు చెప్పారు.

అలాగే, చేయని నేరానికి చిత్రహింసలకు గురై మృతి చెందిన రాజాకన్ను కుటుంబాన్ని ఆదుకుంటానని చెప్పారు. ఆయన భార్య పార్వతమ్మ (సినతల్లి)కి ఇల్లు కట్టి ఇస్తానని హామీ ఇచ్చారు. పార్వతమ్మ పోరాటాన్ని చూసి తాను ఆశ్చర్యపోయినట్టు చెప్పారు. ఆమెకు తప్పకుండా మంచి ఇల్లు నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!