స్టార్ హీరో విడాకుల వ్యవహారం!

దక్షిణాదిన స్టార్ హీరోగా వెలుగొందుతోన్న కథానాయికుడు తన నటనతో, ప్రయోగాత్మక చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఒకట్రెండు హిందీ సినిమాల్లో కూడా నటించాడు. ఆ సినిమాలు ఆయనకు మంచి పేరును తీసుకొచ్చాయి. అయితే ఇప్పుడు ఆయన ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నాడనేది హాట్ టాపిక్ గా మారింది. అతడు ఒంటరి అయితే ఇప్పుడు ఈ వ్యవహారం అంత సీరియస్ అయ్యేది కాదు. కానీ అతడికి వివాహం జరిగింది. భార్య కూడా ఉంది. పైగా ఇప్పుడు ఆ హీరో ప్రేమించేది మరెవరినో కాదూ.. తన భార్య సొంత చెల్లెలు. 
మన హీరో గారికి మరదలు. వీరి ప్రేమ వ్యవహారం ఎంతవరకు వెల్లిందంటే.. భార్యకు విడాకులిచ్చి మరదలిని పెళ్లి చేసుకునేంతగా.. ఆయన మరదలు కూడా హీరోగారిని ప్రేమిస్తుందట. పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పేసిందట. ప్రస్తుతం వీళ్ళిద్దరు పీకల్లోతు ప్రేమలో ఉన్నారని, వీలైనంత తొందరగా భార్యకు విడాకులు ఇచ్చి, మరదలిని పెళ్లాడాలని చూస్తున్నాడు ఈ స్టార్ హీరో. మరి ఈ విషయం ఎక్కడ వరకు వెళ్తుందో.. చూడాలి!