దయచేసి మా ఇద్దరినీ విడదీయకండి!

మెగాస్టార్ చిరంజీవికి రాజశేఖర్ కు మధ్య అప్పట్లో విబేధాలు వచ్చిన సంగతి తెలిసిందే. చిరు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు జీవిత రాజశేఖర్ దంపతులు నేరుగా ఆయనపై విరుచుకుపడ్డారు. అయితే చిరు ఎప్పుడు కూడా వారిపై రియాక్ట్ అవ్వలేదు. తాజాగా రాజశేఖర్ తను నటించిన ‘గరుడ వేగ’ సినిమా ప్రీమియర్ షోకు రమ్మని చిరు ఇంటికి వెళ్ళి మరీ ప్రత్యేకంగా ఆహ్వానించారు.

రాజశేఖర్ కావాలని మెగా ఫ్యాన్స్ ను తనవైపు తిప్పుకోవడానికి ఈ విధంగా చేశాడని ఆయనపై కామెంట్లు చేశారు. దీనిపై స్పందించిన రాజశేఖర్ ‘ఆయకు నాకు ఉన్న విబేధాలు ఎప్పుడో తొలగిపోయాయి. మేమిద్దరం రీసెంట్ గా కలిశామని వార్తలు ప్రచురిస్తున్నారు. కానీ అది నిజం కాదు. దయచేసి చిరుని నన్ను విడదీయొద్దు ప్లీజ్ అంటూ మీడియాను కోరారు. ఒకరిద్దరి మధ్య విబేధాలు వస్తే అవి జీవితాంతం ఉండిపోవని’ అన్నారు.