HomeTelugu Big Stories'2.ఓ'..నాలుగు రోజుల్లోనే రూ.400కోట్లు!

‘2.ఓ’..నాలుగు రోజుల్లోనే రూ.400కోట్లు!

6 2సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ మానియా అంటే ఏంటో గతకొంతకాలంగా చూపెట్టలేదని అభిమానులు నిరాశపడ్డారు. కబాలి, కాలా సినిమాలతో తలైవా అభిమానులు నిరాశపడినా.. ‘2.ఓ’తో వారికి రెట్టింపు ఆనందాన్నిచ్చారు రజనీ. లేటుగా హిట్‌ కొట్టినా.. లేటెస్ట్‌గా హిట్‌ కొడతామని తలైవా ఫ్యాన్స్‌ కాలరేగరేసుకుని చెప్పుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం నాలుగు రోజుల్లో నాలుగు వందల కోట్లకు పరుగులు తీసినట్లు మేకర్స్‌ ప్రకటించారు.

గత గురువారం విడుదలై లాంగ్‌ వీకెండ్‌ను కుమ్మేసిన రజనీ.. వసూళ్లతో అందరినీ ఆశ్యర్యపరిచాడు. డివైడ్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ మూవీ.. రోజురోజుకి వసూళ్లను పెంచుకుంటూ పోతోంది. ప్రముఖ తమిళ సినీ విశ్లేషకుడు రమేష్‌ బాలా ఈ చిత్రవసూళ్లపై ట్వీట్‌ చేశాడు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 52.5(దాదాపు 360కోట్లు) మిలియన్‌ డాలర్లను వసూళ్లు చేసి.. ఫెంటాస్టిక్‌ బీస్ట్స్‌ (40.2)ను వెనక్కునెట్టేసిందని ట్వీట్‌ చేశాడు. యూఎస్‌లో రంగస్థలం ఫుల్‌రన్‌లో వసూళ్లు చేసిన 3.5మిలియన్‌ డాలర్లను కేవలం నాలుగు రోజుల్లోనే క్రాస్‌ చేసేసి నాలుగు మిలియన్‌ డాలర్లకు పరుగులుపెడుతోందని తెలిపాడు. తెలుగులోనే ‘2.ఓ’ ఇప్పటికివరకు దాదాపు 50కోట్లు, హిందీలో 100కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!