
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఆరోగ్య పరిస్థితిపై అపోలో ఆస్పత్రి యాజమాన్యం తాజా హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. సాయంత్రం 6 గంటలకు వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. బీపీ అదుపులోనే ఉందని అపోలో ఆస్పత్రి వైద్యులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు చేసిన వైద్య పరీక్షల్లో ఎలాంటి ఆందోళనరమైన అంశాలు లేవని తెలిపారు. మరికొన్ని పరీక్షలు చేశామని.. వాటి రిపోర్టులు రావాల్సి ఉందని చెప్పారు. ఆ వైద్య పరీక్షల నివేదికలతో పాటు బీపీ స్టేటస్‌ను రాత్రంతా చూసిన తర్వాత.. రజినీకాంత్‌ను డిశ్చార్జిపై రేపు నిర్ణయం తీసుకుంటామని వైద్యులు వెల్లడించారు.













