వర్మ.. మ్యూజిక్ డైరెక్టర్ కి ద్రోహం చేశాడా..?

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రీసెంట్ గా ‘వంగవీటి’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభిస్తోంది. అయితే ఈ సినిమా కోసం తనను ఉపయోగించుకొని క్రెడిట్ ఇవ్వకుండా వర్మ తనను మోసం చేశాడంటూ వాపోతున్నాడు సంగీత దర్శకుడు రాజశేఖర్. నిజానికి రవిశంకర్ ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా పని చేశారు. అయితే రాజశేఖర్ తో ఈ సినిమా టైటిల్ సాంగ్ ‘వంగవీటి’ పాటకు ట్యూన్ కట్టించాడట వర్మ.
అయితే దీనికి గానూ వర్మ ఎలాంటి క్రెడిట్ ఇవ్వలేదని, టైటిల్స్ లో కూడా తన పేరు చూపించలేదని, దయచేసి ఆ పాటను సినిమా నుండి తొలగించమని అభ్యర్దిస్తున్నాడు. వీటిపై వర్మ స్పందిస్తూ.. రాజశేఖర్ పేరు ప్రస్తావించానని.. ఆడియో ఫంక్షన్ కు కూడా తనను పిలిచానని చెబుతున్నాడు. అయితే కొన్ని టెక్నికల్ సమస్యల వలన తన పేరు మిస్ అయి ఉంటుందని దాన్ని ఇంత పెద్దదిగా చేయడం కరెక్ట్ కాదని
అంటున్నారు. మరి ఈ గొడవ ఎప్పటికీ తేలుతుందో.. చూడాలి!